SRCL: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం అని సిరిసిల్ల డివిజనల్ ఇంజనీర్ అంజయ్య అన్నారు. గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటలో సబ్ స్టేషన్ నిర్మాణానికి కావలసిన స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ.. మల్లారెడ్డిపేటలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో లో వోల్టేజ్ సమస్య తీరుతుందన్నారు.