MNCL: దండపల్లి పట్టణంలో కన్న తల్లిపట్ల కుమారుడు అమానుషంగా ప్రవర్తించిన ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన వృద్ధురాలు గడ్డం వరమ్మకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆస్తి పంపకాల సమయంలో తల్లిని చూసుకుంటానని చిన్న కుమారుడు శ్రీనివాస్ హామీ ఇచ్చి, ఆస్తి తన చేతికి వచ్చిన తర్వాత తల్లిని ఇంటి నుంచి గెంటేశాడు. వృద్ధురాలు వరమ్మ విలపిస్తూ, తనను ఆదుకోవాలని వేడుకుంటోంది.