NLG: మర్రిగూడ మండలంలోని సరంపేట శివారులో 600 ఏళ్ల చరిత్ర కలిగిన స్తంభగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. శివన్నగూడెం రిజర్వాయర్‌కు సమీపంలో ఉన్న ఈ క్షేత్రంలో వసతులు కల్పించి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ ఏటా మాఘ మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి.