MNCL: జన్నారం మండల నూతన తహసీల్దార్‌గా బక్కయ్య బాధ్యతలు స్వీకరించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ టి మండలంలో విధులు నిర్వర్తించిన బక్కయ్య బదిలీపై జన్నారం వచ్చారు. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ MRO రామ్మోహన్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. నూతన తహసీల్దార్ బక్కయ్యను కార్యాలయ అధికారులు, సిబ్బంది అభినందించారు.