SRCL: తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో సర్పంచ్ రచన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి ప్రజలకు ఉచితంగా మందులను పంపిణీ చేశామన్నారు. ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్, వార్డు సభ్యులు, వైద్యులు ఉన్నారు.