ADB: ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీ, సంజయ్ నగర్ ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ కిరణ్ తెలిపారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను మార్చే పనుల దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పవర్ కట్ ఉంటుందని పేర్కొన్నారు. కావున ఈ ప్రాంతాల వినియోగదారులు పనులకు సహకరించాలని ఆయన కోరారు.