MDK: నిజాంపేట్ మండలం నందగోకుల్ గ్రామానికి చెందిన 80 ఏళ్ల రాములు గత 12 ఏళ్లుగా నిరంతరాయంగా హెల్మెట్ ధరిస్తూ రోడ్డు భద్రతపై ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన నిబద్ధతను గుర్తించిన మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆయనను ఘనంగా సన్మానించారు. రాములు స్ఫూర్తితో ఆ గ్రామంలో ‘నో హెల్మెట్-నో ఎంట్రీ’ నిబంధనను అమలు చేస్తుండటం విశేషం.