నిర్మల్ జిల్లా మత్స్యశాఖ ఇన్ఛార్జ్ సహాయ సంచాలకుడిగా అవినాశ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. నూతన ఏడీకి కార్యాలయ సిబ్బంది పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. AD మాట్లాడుతూ.. జిల్లాలో మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విధి నిర్వహణలో అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని పేర్కొన్నారు.