BDK: కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు జూలూరుపాడు మండల కేంద్రంలో సీఐ శ్రీలక్ష్మి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.