GDWL: ఇంటర్మీడియట్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గద్వాల పట్టణం రాఘవేంద్ర కాలనీకి చెందిన సృజనను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బుధవారం ఘనంగా సన్మానించారు. కొట్టె మాణిక్యమ్మ జూనియర్ కళాశాలలో విద్యనభ్యసించిన సృజన, ఇంటర్మీడియట్లో 1000 మార్కులకు గాను 985 మార్కులు సాధించింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమెను శాలువాతో సత్కరించారు.