NLG: అంగన్వాడీ కేంద్రాల్లో తల్లీబిడ్డలకు సంపూర్ణ పోషకాహారం అందించాలని కట్టంగుర్ సర్పంచ్ ముక్కామల శ్యామల అన్నారు. శుక్రవారం కట్టంగూర్లోని అంబేద్కర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ్ అభియాన్-పోషిక పక్షం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గర్భిణులు, బాలింతలకు పోషక విలువలున్న ఆహార పదార్థాలపై అవగాహన కల్పించాలన్నారు.