TG: ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భద్రాచలం, బాసర ఆలయాల అభివృద్ధికి టెండర్లు ఖరారయ్యాయి. రూ.586 కోట్లతో భద్రాచలం, రూ.225 కోట్లతో బాసర దేవస్థానాల అభివృద్ధి పనులు జరగనున్నాయి. గోదావరి పుష్కరాల నాటికి పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయ పునఃనిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు.