E.G: దేవరపల్లిలో రబీ సీజన్‌కి సంభందించిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దేవరపల్లి సొసైటి ఛైర్మన్ ఉప్పులూరి నోమేంద్ర రామారావు ప్రారంభించారు. రైతుల నుంచి ధాన్యం సేకరించి 24 గంటల్లో రైతులు ఖాతాలకు ప్రభుత్వం సొమ్ము జమ చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.