W.G: నరసాపురం డీఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎం.సుధాకర్ శుక్రవారం పాలకొల్లులోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. డీఎస్పీకి మంత్రి అభినందనలు తెలుపుతూ.. నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలన్నారు. అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ఉన్నారు.