ప్రముఖ ఐటీ సేవల కంపెనీ కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ 2025 ఆర్థిక సంవత్సరంలో 10.7 మిలియన్ డాలర్ల వేతనాన్ని అందుకున్నారు. 2024తో పోలిస్తే ఆయన వేతనం 18 శాతం పెరగడం గమనార్హం. ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్లో సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత 2023లో రవికుమార్ కాగ్నిజెంట్లో చేరారు.