WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో పాఠశాల స్థల యాజమాన్య హక్కులపై వివాదం నెలకొంది. ఈ అంశంపై తహసీల్దార్ విజయ్ సాగర్ సమక్షంలో శనివారం రికార్డులను పరిశీలించారు. స్థలాన్ని విరాళంగా ఇచ్చిన దాత ఉపేంద్ర శాస్త్రి తిరిగి ఆ స్థలాన్ని తనకు ఇవ్వాలని డిమాండ్ చేయగా, పాఠశాల నిర్వాహకులు అది ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాల్సిందిగా వారు తెలిపారు.