MLG: మేడారం గద్దెల ప్రాంగణంలో ఇటీవల ప్రమాదవశాత్తు కాలు కోల్పోయిన బాలునికి శనివారం మంత్రి సీతక్క ఆర్థిక సాయం అందించారు. అలాగే బాలుని తల్లికి ఉద్యోగ నియామక పత్రం కూడా అందజేశారు. బాధిత కుటుంబం పట్ల ప్రభుత్వం సానుభూతితో వ్యవహరిస్తుందని, అవసరమైన అన్ని సహాయాలు కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు.