సత్యసాయి: చైనాలోని ‘వసంతమేళా-2026’లో ధర్మవరం చేనేత మగ్గాన్ని ప్రదర్శించిన జాతీయ అవార్డు గ్రహీత నాగరాజును జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఇవాళ సత్కరించారు. ఆయన నివాసానికి వెళ్లిన కలెక్టర్.. మగ్గంపై డిజైనింగ్ చేసే విధానం, గ్రాఫ్ తయారీ వంటి సాంకేతిక అంశాలను అడిగి తెలుసుకున్నారు. నాగరాజు వంటి కళాకారుల వల్ల జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ కొనియాడారు.