AP: సోషల్ మీడియా కేసులపై మాజీ సీఎం జగన్ ఘాటుగా స్పందించారు. ‘వాస్తవాలు మాట్లాడితే ఉలుకు ఎందుకు. పరిపాలన అంటే ప్రశ్నించే గొంతుకలకు సంకెళ్లు వేయడమా. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే దేశద్రోహమా. బీసీ వర్గానికి చెందిన పూడి శ్రీహరి చేసిన తప్పేంటి. పూడి శ్రీహరి ఏమైనా ఉగ్రవాదా? వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. ప్రజలు మీకు బుద్ధిచెప్పే రోజు దగ్గరలో ఉంది’ అని హెచ్చరించారు.