TG: రాష్ట్రంలో కొత్తగా వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్ పోర్టులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షించారు. వరంగల్ ఎయిర్ పోర్టుకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కొత్తగూడెంలో ప్రతిపాదిత భూమి అనువుగా లేదని విమానయాన శాఖ తెలపడంతో.. దీనిపై నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.