AKP: ఎస్ రాయవరం మండలం పెనుగొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్మించనున్న పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనానికి హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం శంకుస్థాపన చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో దీనిని నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు.