RCBతో జరుగుతున్న మ్యాచ్లో DC స్టార్ బ్యాటర్ KL రాహుల్ చెలరేగిపోతున్నాడు. 30 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో IPLలో తన 42వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒక దశలో 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును, స్టబ్స్(18*)తో కలిసి ఆదుకున్నాడు. వీరిద్దరూ 4వ వికెట్కు 68* పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఢిల్లీ 10 ఓవర్లలో 87/3 పరుగులు చేసింది.