ASR: పాడేరు మండలంలోని మినుములూరు పీహెచ్సీలో శనివారం 8వ పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పీహెచ్సీ వైద్యాధికారి మనోజ్ణ, ఐసీడీఎస్ సీడీపీవో శారదాదేవి గర్భిణిలు, బాలింతలకు పోషకాహారం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి అవగాహన కల్పించారు. జంక్ ఫుడ్ తినడం వల్ల, పిల్లలకు పెట్టడం వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించారు. పౌష్టికాహారం తీసుకోవాలన్నారు.