HNK: కాజీపేట మండలంలోని టేకులగూడెం గ్రామంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ… తెలంగాణను ఆయిల్ పామ్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం మా లక్ష్యమని, రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి పంటల మార్పు అవసరమని, రైతులు ఆయిల్ ఫామ్ పంట సాగుపై దృష్టి సారించాలన్నారు.