CTR: ద్రవిడ వర్సిటీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు అధ్యాపకులు, సిబ్బంది సహకరించాలని VC C.మల్లయ్య పేర్కొన్నారు. ద్రవిడ వర్సిటీ 29వ వార్షికోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. వర్సిటీ స్థాపిత లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగుతుందన్నారు. విద్యార్థులు వర్సిటీలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు.