TG: ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. ముఖ్యంగా ఈ నెల 20న సీఎం చేపట్టనున్న మేడిగడ్డ పర్యటన ఏర్పాట్లపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. బ్యారేజీ మరమ్మతులు, NDSA సిఫార్సుల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే.