AP: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన హరివంశ్ నారాయణ్ సింగ్‌కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన హరివంశ్‌కు లేఖ రాశారు. వరుసగా మూడోసారి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఈ ఎన్నిక నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు.