SKLM: నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 25వ న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సాయికుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో 12 కంపెనీలు పాల్గొని, 300 కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.