BDK: జిల్లా కాంగ్రెస్ పూర్తిస్థాయి కమిటీని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం ప్రకటించారు. జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న నేతృత్వంలో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తూ ఈ జాబితాను విడుదల చేశారు. జిల్లాలో పార్టీ బలోపేతం, కేడర్ మధ్య సమన్వయం కోసం ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.