ELR: ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ తెలిపారు. శనివారం భీమడోలు మండలం సూరప్పగూడెం రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గోనెసంచులు అందుబాటులో ఉంచినట్లు, తేమ శాతం, రవాణా విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.