SRD: బొల్లారం డివిజన్లోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ప్రవేశ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 6వ తరగతికి 228 మంది, 7 నుంచి 10వ తరగతులకు 151 మంది విద్యార్థులు కలిపి మొత్తం 379 మంది పరీక్ష రాయనున్నారని ప్రిన్సిపల్ శ్రీదేవి తెలిపారు. పరీక్ష కేంద్రంలో ఆరోగ్య సిబ్బంది, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాయని, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆమె సూచించారు.