MLG: మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఆదివారం ములుగు జిల్లా మేడారంలో పర్యటించనున్నారు. పొంగులేటి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 10.30 గంటలకు చేరుకోనున్నారు. అనంతరం సమ్మక్క, సారలమ్మ వన దేవతలను దర్శించుకుని, యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం,అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.