VSP: ఏయూ శతాబ్ధి ఉత్సవాల వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో విజ్ఞాన విశ్వవిద్యాలయం ఛైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ.. ఏయూ ప్రపంచ స్థాయిలో ఖ్యాతి గాంచిందన్నారు. అనుబంధ కళాశాలలకు విశ్వవిద్యాలయం మార్గనిర్దేశం చేయాలని, బోధన సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.