మంచిర్యాలలోని ఎన్టీఆర్ నగర్లో మానసిక, అంగ వైకల్యంతో బాధపడుతున్న పేద కుటుంబానికి చెందిన ఏడేళ్ల విక్రమ్ అనే బాలుడికి జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధి మధుసూదన్ రెడ్డి చేయూత అందించారు. బాలుడికి ఏడాది పాటు వ్యాధికి సంబంధించిన మందులు అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు శనివారం రెండు నెలలకు సరిపడా ఖరీదైన మందులు అందజేశారు.