NGKL: విద్యుత్ సంస్థల ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 2017లో పర్మినెంట్ చేస్తామని ప్రకటించి గత ప్రభుత్వం మోసం చేసిందని తెలిపారు. ఐదు నెలలుగా కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. వారికి వెంటనే APSEB నిబంధనలు అమలు చేసి న్యాయం చేయాలని విన్నవించారు.