HNK: అర్జున్ సురవరం, కేశవ, కిరాక్ పార్టీ, స్పై, స్వామిరారా తదితర చిత్రాల్లో నటించిన హీరో నిఖిల్ శుక్రవారం ఓరుగల్లుకు రానున్నారు. వరంగల్ నిట్లో జరుగుతున్న స్ప్రింగ్ స్ప్రీ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా వస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిట్ ఓల్డ్ ఆడిటోరియంలో విద్యార్థులతో మమేకమై చర్చాగోష్ఠి నిర్వహిస్తారు. ఇందుకోసం ఆడిటోరియంలో తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు.