KMM: రెవెన్యూ వ్యవస్థలో నిర్లక్ష్యం అస్సలు సహించమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనుదీప్ అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. భూసేకరణ, భూ భారతీ, సాదా బైనామా, ఇతర రెవెన్యూ సంబంధిత పెండింగ్ అంశాలపై సమీక్షించారు. అభివృద్ధి పనులు సమయానికి పూర్తి కావాలంటే భూ సేకరణలో జాప్యం ఉండకూడదన్నారు.