MNCL: జన్నారం మండల కేంద్రంలో పీసీఆర్ (పూర్ణచందర్రావు) ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం మజ్జిగ పంపిణీ కొనసాగుతోంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వార సంతకు వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు స్వచ్చందంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ముడుగు ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీఆర్ ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.