PDPL: ధర్మారం మోడల్ స్కూల్లో ప్రవేశానికి సంబంధించి ఈనెల 19న నిర్వహించే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపల్ రాజకుమార్ ఇవాళ తెలిపారు. 6వ తరగతికి ఉదయం10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, 7 నుంచి 10 తరగతులకు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్, ఆధార్ కార్డు జిరాక్స్‌తో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.