మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని 8వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని వీధులను శుభ్రం చేయడంతో పాటు, తడి చెత్త మరియు పొడి చెత్తను వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య పాల్గొన్నారు.