TG: నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పామనగుండ్ల దగ్గర టైర్ పేలి బస్సు డివైడర్ను ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో.. ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.