TG: రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలంతా తలో చెయ్యి వేసి ఒక వెయ్యి కోట్లు పోగు చేసి రాహుల్ గాంధీ కుటుంబానికి ఇచ్చే సామర్థ్యం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎం లాగా మారిందని తామెన్నో సార్లు చెప్పిన విషయం.. ఇప్పుడు సాక్షాత్తూ రేవంత్ రెడ్డే నిస్సిగ్గుగా ఒప్పుకున్నాడని విమర్శించారు.