గురక తగ్గించుకోవడానికి జీవనశైలిలో మార్పులు అవసరం. రాత్రి పూట వెల్లకిలా పడుకోకుండా, పక్కకు తిరిగి (ఎడమ వైపు) పడుకోవడం వల్ల శ్వాసకోశ మార్గాలు సులభంగా తెరుచుకుంటాయి. బరువు తగ్గడం, రాత్రి వేళల్లో ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల గురక చాలా వరకు తగ్గుతుంది. అలాగే, పడుకునే ముందు గోరువెచ్చని నీరు తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచి ఫలితాలను ఇస్తాయి.