ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లలో బెంగాల్ ముర్షిదాబాద్కు చెందిన కోహితూర్ మామిడి ఒకటి. అత్యంత సున్నితంగా ఉండే ఈ మామిడి పండ్లను దూదిలో భద్రపరిచి అమ్ముతారు. మార్కెట్లలో ఒక్కో మామిడి పండు ధర ఏకంగా రూ.1,500 వరకు ఉంటుంది. అద్భుతమైన రుచి, ప్రత్యేకతలు కలిగిన ఈ పండు.. మామిడి ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.