VZM: రాజకీయ పార్టీలు ప్రతీ పోలింగ్ కేంద్రానికి తమ ప్రతినిధులుగా బిఎల్ఏలను నియమించి, ఆ జాబితాను త్వరగా అందజేయాలని జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు కోరారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. బిఎల్ఎలను నియమించుకోవడం ద్వారా ఎన్నికల ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేయవచ్చన్నారు.