WNP: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల నిర్వహణపై హైదరాబాద్ నుంచి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న వారోత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశించారు.