వాట్సాప్ తన యూజర్ల కోసం అదిరిపోయే ‘యూజర్ నేమ్’ ఫీచర్‌ను తెస్తోంది. ఇకపై మీ ఫోన్ నెంబర్ ఎవరికీ ఇవ్వకుండానే, కేవలం యూజర్ నేమ్‌తో ఇతరులతో చాట్ చేయవచ్చు. దీనివల్ల మీ వ్యక్తిగత గోప్యతకు మరింత రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం ఈ అప్డేట్ దశలవారీగా విడుదలవుతోంది. ప్రొఫైల్ సెట్టింగ్స్‌లో మీకు నచ్చిన పేరును సెట్ చేసుకోవచ్చు.