TG: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితులు రోహిత్ రెడ్డి, రితిష్ రెడ్డి, నమిత్ శర్మలను మూడోసారి పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉప్పరపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 10న సా.4 గంటల వరకు నిందితులను సిట్ అధికారులు విచారించనున్నారు. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో జరగనున్న ఈ విచారణలో డ్రగ్స్ పార్టీ నిర్వహణ, ఆర్థిక లావాదేవీలపై లోతుగా ప్రశ్నించనున్నారు.