AP: అంబేద్కర్ వ్యక్తి కాదు మహా శక్తి అని మంత్రి అచ్చెన్నాయుడు కొనియాడారు. దేశంలో ఏ కులానికి, మతానికి, పౌరుడికి ఇబ్బంది లేకుండా ..రాజ్యాంగాన్ని ఇచ్చిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తామని పేర్కొన్నారు.