TG: ఏప్రిల్ 20న జగిత్యాలలో జరిగే బహిరంగ సభకు కేసీఆర్ హాజరు కాబోతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అయ్యాక పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ ఏ ఏ ప్రాంతాల్లో డిక్లరేషన్లు ప్రకటించి ప్రజలను మోసం చేసిందో.. అక్కడే ఆ డిక్లరేషన్లు గుర్తు చేస్తూ సభలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.